Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:56 PM

మహాశివరాత్రి జాతరకు ఎంపీకి ఆహ్వానం పిలుపు

10-02-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బిచ్కుంద మఠం పీఠాధిపతి సోమయ్యప్ప మహారాజ్ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న జాతర కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్‌కు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా నారాయణాఖేడ్ నియోజకవర్గం, ఖేడ్ మున్సిపల్ పరిధిలోని జహీరాబాద్‌లో ఉన్న ఎంపీ స్వగృహంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ శెట్కార్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శెట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బిచ్కుంద మఠంలో నిర్వహించనున్న జాతర కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా జరగనున్న నేపథ్యంలో ఈ ఆహ్వానం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ సందర్భంగా జగదీష్, మాణిక్ రావు పటేల్, భాను గౌడ్, సాయి చరణ్, దత్తు రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత శోభాయమానంగా చేశారు.

Sthanikam

మహాశివరాత్రి జాతరకు ఎంపీకి ఆహ్వానం పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News