Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:44 AM

మహాశివరాత్రి బందోబస్తు ఏర్పాట్లపై బలివే ఆలయంలో డీఎస్పీ శ్రీ కె వి వి ఎన్ వి ప్రసాద్ నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ క్షేత్రస్థాయి పరిశీలన

మహాశివరాత్రి బందోబస్తు ఏర్పాట్లపై బలివే ఆలయంలో డీఎస్పీ శ్రీ కె వి వి ఎన్ వి ప్రసాద్ నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ క్షేత్రస్థాయి పరిశీలన

మహాశివరాత్రి బందోబస్తు ఏర్పాట్లపై బలివే ఆలయంలో డీఎస్పీ శ్రీ కె వి వి ఎన్ వి ప్రసాద్ నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ క్షేత్రస్థాయి పరిశీలన
February 11, 2026 04:32 AM 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం బలివే వీరేశ్వర స్వామి దేవాలయాన్ని నూజివీడు డీఎస్పీ శ్రీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ ముసునూరు ఎస్ఐ చిరంజీవి మరియు దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమైన భద్రతా చర్యలు రద్దీ నియంత్రణ తమ్మిలేరు నుండి దేవాలయ ప్రాంగణం వరకు పటిష్ట భద్రత. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాల ఏర్పాటు. ట్రాఫిక్ మరియు పార్కింగ్ వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పార్కింగ్ స్థలాల కేటాయింపు. విజయరాయి వైపు నుండి వచ్చే ద్విచక్ర వాహనాలను దేవాలయం వరకు అనుమతించకుండా పార్కింగ్ వద్దే నిలిపివేయాలని ఆదేశం. భక్తులు భద్రత పర్యవేక్షణ కోసం డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు మరియు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. తమ్మిలేరు నది వద్ద భక్తులు స్నానాలు ఆచరించే ప్రదేశాలలో ప్రమాదాలు జరగ కుండా ముందస్తు జాగ్రత్తలు. మైకుల ద్వారా భక్తులకు ఎప్పటి కప్పుడు సూచనలు మరియు సలహాలు అందించాలని సిబ్బందికి దిశానిర్దేశం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామి వారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా అధికారులు, కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని డీఎస్పీ ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News