Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:14 PM

మహనీయుడికి ఘన నివాళులు అర్పించిన అంబేద్కర్ యువజన నాయకులు

05-04-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సమతావాది, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు బోదుల నర్సింహా మాట్లాడుతూ, 1908 ఏప్రిల్ 5న బీహార్‌లో జన్మించిన జగ్జీవన్ రామ్ చిన్ననాటి నుంచే సామాజిక వివక్షను ఎదుర్కొని, దానికి వ్యతిరేకంగా పోరాడి సమానత్వానికి మార్గదర్శిగా నిలిచారని తెలిపారు. విద్యాభ్యాస దశలోనే అన్యాయాలపై తిరుగుబాటు చేసిన ఆయన, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం కృషి చేశారని అన్నారు.భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి, ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపనలో కీలక పాత్ర పోషించిన ఆయన, స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలు జీవితం గడిపారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం కేంద్రంలో పలు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించి దేశ అభివృద్ధికి విశేష సేవలందించారని కొనియాడారు.1971 భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. అనంతరం ఉప ప్రధాన మంత్రిగా సేవలందించి, దాదాపు 40 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగి అరుదైన రికార్డు సృష్టించారని చెప్పారు.జగ్జీవన్ రామ్ కలలుగన్న సమ సమాజ స్థాపన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు బోదుల లింగస్వామి, ప్రధాన కార్యదర్శి ఆరుట్ల శేఖర్, సీనియర్ నాయకులు ఆరుట్ల యాదయ్య, ఉదరి యాదయ్య, బోదుల స్వామి, పుర్రు శంకర్, ఆరుట్ల నరేష్, ఉదరి రాకేష్, బోదుల గణేష్, ఆరుట్ల విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహనీయుడికి ఘన నివాళులు అర్పించిన అంబేద్కర్ యువజన నాయకులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News