Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:14 PM

మహానేతకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మార్పీఎస్ నేతలు

05-04-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు, మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బోయ రామచంద్రం మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ దేశ నిర్మాణంలో విశేష సేవలు అందించిన మహానేత అని కొనియాడారు.స్థానిక బస్టాండ్ వద్ద ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కడు పేదరిక దళిత కుటుంబం నుంచి ఎదిగిన జగ్జీవన్ రామ్ భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించి, డా. అంబేద్కర్‌కు అండగా నిలిచారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా అనేక శాఖల్లో పనిచేసి పలు చట్టాలకు రూపకర్తగా నిలిచిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు.అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రాజకీయ కుట్రల కారణంగా ప్రధాని పదవి దూరమైన దళిత నాయకుడని వ్యాఖ్యానించారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికీ కోట్లాది ప్రజలకు ఉపయోగపడుతున్నాయని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మేడి యాదయ్య, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాము, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చింతల సాయిలు, సుక్క సుదర్శన్, సామాజిక ఉద్యమకారుడు కట్టెల లింగస్వామి, మాజీ మండల అధ్యక్షులు దొనకొండ కృష్ణ, నాయకులు బద్రి గాలయ్య, బోయ సృజన్, ముత్యాల గణేష్, దొనకొండ కిరణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహానేతకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మార్పీఎస్ నేతలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News