Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:09 PM

మహాలక్ష్మి పథకానికి మహా విజయోత్సవం

మహాలక్ష్మి పథకానికి మహా విజయోత్సవం

మహాలక్ష్మి పథకానికి మహా విజయోత్సవం
31-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో మహిళల ఆదా రూ.10,012 కోట్లు దాటింది

భువనగిరిలో ఘనంగా విజయోత్సవ సమావేశం

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి బస్ స్టాండ్‌లో మహాలక్ష్మి పథకం విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం అందించిన ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆదా చేసిన ప్రయాణ ఖర్చు రూ.10,012 కోట్లు దాటిన సందర్భంగా ఈ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్ రావు, భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పొతంశెట్టి మంజుల వెంకటేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహ్మద్ అవైస్ చిస్తీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి, ఆర్‌డీఓ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ “మహిళల స్వేచ్ఛా ప్రయాణం తెలంగాణకు గర్వకారణం” అని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో అందించే ఉచిత సేవలను కూడా మహిళలు వినియోగించుకోవాలని సూచించారు.జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారత దిశగా ప్రతి మండల మహిళా సమాఖ్యకు ఒక బస్సు కొనుగోలు చేయడానికి అనుమతులు లభించాయని తెలిపారు. ఆ బస్సులను ఆర్టీసీ కు అద్దెకు ఇస్తే నెలకు రూ.69,500 చొప్పున సమాఖ్య ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. జిల్లాలో మహిళలకు రూ.611 కోట్ల రుణ లక్ష్యానికి గాను రూ.632 కోట్ల రుణాలు మంజూరు చేయగా, 99 శాతం రుణాలు సకాలంలో చెల్లిస్తున్నారని వివరించారు.ఆర్‌డీఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలు ఉచిత ప్రయాణం ద్వారా ఆదా అయ్యే మొత్తాన్ని పొదుపుగా నిల్వచేసుకొని భవిష్యత్తులో ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ కొండల్ రావు, ఆర్‌టీసీ డీఎం సి.హెచ్ మురళీకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, కార్యదర్శి పల్లవి, కోశాధికారి అలివేలు, అదనపు డీఆర్‌డీఓ కోట జంగారెడ్డి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

మహాలక్ష్మి పథకానికి మహా విజయోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News