Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:02 AM

మహిళా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం

మహిళా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం

మహిళా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం
26-12-2025 112 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం

బోరంచలో ఘనంగా చీరల పంపిణీ

స్థానిక ప్రతినిధి నారాయణఖేడ్

నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలంలోని బోరంచ గ్రామంలో మహిళా సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీరల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవ్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం గ్రామస్థాయిలో సక్రమంగా కొనసాగింది. కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప నేతృత్వంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పంచగామ బీరప్ప మాట్లాడుతూ… పేద, మధ్యతరగతి మహిళలపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు వారి గౌరవం, ఆత్మవిశ్వాసం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి అర్హురాలైన మహిళకు చీర అందజేస్తామని స్పష్టం చేశారు. మహిళలు కుటుంబానికే కాదు, సమాజ నిర్మాణానికి కూడా పునాదులని పేర్కొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో ప్రత్యక్షంగా ప్రజల చేతికి చేరుతున్నాయంటే అది ప్రజా ప్రభుత్వం–ప్రజా పాలన కృషికి నిదర్శనమని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళల జీవితాల్లో ప్రభుత్వ పథకాలు మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పారు. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సామాజిక సమానత్వానికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, అందుకే మహిళా సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని పథకాలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి గ్రామస్థాయిలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సక్రమంగా అమలయ్యేలా ప్రజలంతా సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాలు సాయమ్మ, వీఓఏ బైండ్ల అనసుజ, వార్డు సభ్యుడు బాలకృష్ణ, గ్రామ దేవస్థానం చైర్మన్ మల్లయ్య, గ్రామ పెద్దలు నర్సింహులు, యువత, వివిధ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News