Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:33 PM

మాఘ అమావాస్యకు ఘనంగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు

18-01-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం మాఘ అమావాస్యను పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలతో అలంకరించి ప్రాతఃకాల పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు మొక్కులు తీర్చుకుంటూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో మంజీర నది ఒడ్డున కొలువై ఉన్న శ్రీ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం ఎంతో మహిమాన్వితమైనదని తెలిపారు. అమ్మవారికి చేసే మొక్కులు ఎంతో ప్రాముఖ్యత కలవని, భక్తుల కోరికలను నెరవేర్చే శక్తి కలిగిన దేవతగా అమ్మవారు ప్రసిద్ధి చెందినారని పేర్కొన్నారు.ప్రత్యేకించి మాఘ అమావాస్య వంటి పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తుల నినాదాలతో, ఆధ్యాత్మిక వాతావరణంతో పులకరించిపోయాయి.

Sthanikam

మాఘ అమావాస్యకు ఘనంగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News