Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:40 AM

మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి సేవలు చిరస్మరణీయం

04-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

శ్రీ సాయి యాదాద్రి సేవాశ్రమం అద్యక్షులు దెబ్బడి అశోక్,జేవై శెట్టి ప్రధాన కార్యదర్శి

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో:జి.శ్రీనివాస్(స్థానికం: జనవరి 04)

తమ స్వంత వ్యవసాయ భూమిలోని ఒక ఎకరం స్థలంలో సుమారు కోటి రూపాయల ఖర్చుతో భవనం నిర్మాణం చేసి, ప్రభుత్వం తరపున నడిపించే వృద్ధాశ్రమానికి దానం చేసిన మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి సేవలు ఎల్లకాలం నిలిచిపోతాయని శ్రీ సాయి యాదాద్రి సేవాశ్రమం అద్యక్షులు దెబ్బడి అశోక్,ప్రధాన కార్యదర్శి జే.వై శెట్టి అన్నారు.ఆదివారం చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామంలో జరిగిన మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి సంస్మరణ సభలో వారు మాట్లాడారు. మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, పెద్ద కొండూరు గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి,పెరిగి ప్రభుత్వ ఉపాద్యాయులుగా సేవలందించి,ఉద్యోగ విరమణ తర్వాత గ్రామంలో ఒక వృద్ధాశ్రమం ను నిర్మించి సీనియర్ సిటిజన్ లకు సేవాకార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకోవడం హర్షణీయమని వారన్నారు. ఈ సంస్మరణ సభలో సత్యనారాయణ రెడ్డి పెద్ద కుమార్తె కల్పన మాట్లాడుతూ మా తండ్రిగారైన సత్యనారాయణ రెడ్డి సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శం కావాలని కోరారు. తన తండ్రి గారైన సత్యనారాయణ రెడ్డి నెలకొల్పిన వృద్ధాశ్రమం పలువురు కి సేవలందించే విధంగా సహకారం అందించాలని ఆమె కోరారు.ఈ సంస్మరణ సభలో ఆశ్రమ వ్యవస్థాపకులు మేరెడ్డి జానకమ్మ, శ్రీ సాయి యాదాద్రి సేవాశ్రమం గౌరవ సలహాదారులు నేరెళ్ళ‌‌‌ కోటేశ్వరరావు, ఆర్గనైజర్ మహేష్,యాదాద్రి భువనగిరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ,జిల్లా డైరెక్టర్స్ కొడారి వెంకటేష్,జంపాల అంజయ్య,మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి చిన్న కూతురు వినీత,పెద్దలు పాటి యాదిరెడ్డి,కళ్ళెం బాల్ రెడ్డి,డాక్టర్ రాజా సుధాకర్,మాదగోని బిక్షపతి గౌడ్,ఆశ్రమ దాతలు,రిటైర్డ్ ఉద్యోగులు,ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు పాల్గొన్నారు.

Sthanikam

మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి సేవలు చిరస్మరణీయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News