Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:42 AM

మేడ్చల్ లో తొమ్మిదవ తరగతి విద్యార్థి అదృశ్యం.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

26-12-2025 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రుల వేడుకోలు
మేడ్చల్/అత్వెల్లి, ( స్థానికం): మేడ్చల్ జిల్లా అత్వెల్లిలోని సెయింట్ జాన్స్ అకాడమీ (St. Johns Academy) పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మహేశ్వరం కార్తీక్ (14) అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత కొన్ని రోజులుగా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, పెద్దకాపర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం కార్తీక్, మేడ్చల్ లోని అత్వెల్లిలో ఉంటూ సెయింట్ జాన్స్ అకాడమీలో చదువుకుంటున్నాడు. అయితే బాలుడు పాఠశాల నుండి అదృశ్యమయ్యాడని, ఎంత వెతికినా జాడ తెలియరాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే దయచేసి సమాచారం అందించి పుణ్యం కట్టుకోవాలని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేశారు.
ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాల్సిన వివరాలు:
బాలుడి వివరాలు లేదా ఆచూకీ తెలిసిన వారు వెంటనే కింద ఇచ్చిన ఫోన్ నంబర్‌కు లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
పేరు: మహేశ్వరం కార్తీక్
వయస్సు: 14 సంవత్సరాలు
చదువు: 9వ తరగతి
స్వగ్రామం: పెద్దకాపర్తి, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా
సంప్రదించాల్సిన నంబర్: 79956 41290
Sthanikam

మేడ్చల్ లో తొమ్మిదవ తరగతి విద్యార్థి అదృశ్యం.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News