Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

మాధవరెడ్డి ఆశయ సాధనకు పునరంకితం కావాలి ​

02-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దండు మల్కాపురంలో విగ్రహానికి నివాళులర్పించిన శ్యాంసుందర్‌ ముదిరాజ్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మహోన్నత నాయకుడు, దివంగత మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి అని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్‌ దేప శ్యాంసుందర్‌ ముదిరాజ్‌ కొనియాడారు. మాధవరెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం చౌటుప్పల్‌ మండల పరిధిలోని దండు మల్కాపూర్‌ బస్టాండ్‌ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి ఉప సర్పంచ్‌ మీసాల నర్సింహతో కలిసి శ్యాంసుందర్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిలో మాధవరెడ్డి పాత్ర అజరామరమని అన్నారు. ముఖ్యంగా దండు మల్కాపూర్‌ గ్రామం నేడు ఈ స్థాయిలో అభివృద్ధి పథంలో ఉందంటే అది ఆనాడు మాధవరెడ్డి వేసిన పునాదేనని గుర్తుచేశారు. ఆయన ఆశయ సాధనలో భాగంగానే వారి సతీమణి ఉమా మాధవరెడ్డి గ్రామంలో ఘాట్‌ కంచె భూముల పంపిణీ చేపట్టారని, అది గ్రామ ప్రజలకు పెద్ద వరమని అన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి అభిమానులు బుర్ర ముత్యాలు గౌడ్, చామట్ల బిక్షపతి, బుర్ర అయోధ్య గౌడ్, పటేల్ వెంకట్ రెడ్డి, పబ్బు శ్రీనివాస్ గౌడ్, సిలువేరు బిక్షపతి, జహంగీర్, అప్పీసు లింగస్వామి, గుండ్ల లింగస్వామి, చందుపట్ల సాయి నేత, బాతరాజు శివక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాధవరెడ్డి ఆశయ సాధనకు పునరంకితం కావాలి ​

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News