Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

మాధక ద్రవ్యాల నిర్మూలన – మన కర్తవ్యం: కార్తిక్, శ్రీనిధి సన్మానం

17-02-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాజేందర్ నగర్‌లోని వాలంతరీ రీసర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో పీయం శ్రీ ప్రహరీ క్లబ్ సభ్యుల మాధక ద్రవ్యాల నిర్మూలన – మన కర్తవ్యం అనే రెండు రోజుల తెలంగాణ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ శిక్షణలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.నారాయణఖేడ్ జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కార్తిక్, శ్రీనిధి ఈ కార్యక్రమంలో పాల్గొని పాఠశాలకు గౌరవం తీసుకొచ్చారు. శిక్షణలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, యువత భవిష్యత్తుపై వాటి ప్రభావం, నివారణ చర్యల గురించి అవగాహన కల్పించబడింది.యాంటీ నార్కోటిక్ ఎస్‌పీ సీతారాం ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద ఘటనలు గమనించినట్లయితే వెంటనే 1908 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థి కార్తిక్‌ను ఎస్‌పీ సీతారాం మెడల్‌తో సత్కరించారు. ఈ విజయంపై పాఠశాల హెచ్‌ఎం మన్మధ కిషోర్, ఉపాధ్యాయులు రాజశేఖర్, చంద్రశేఖర్ ఆచార్యలు కార్తిక్‌కు అభినందనలు తెలియజేశారు.కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యతాభావం పెరిగింది, మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం స్పష్టమైంది.

Sthanikam

మాధక ద్రవ్యాల నిర్మూలన – మన కర్తవ్యం: కార్తిక్, శ్రీనిధి సన్మానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News