Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:13 PM

మద్వార్ గ్రామంలో ఘనంగా క్రికెట్ ప్రీమియం టోర్నమెంట్ ప్రారంభించిన:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

20-05-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఖేడ్ మండలం మద్వార్ గ్రామంలో గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు నిర్వహించిన క్రికెట్ ప్రీమియం టోర్నమెంట్‌ను ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో ఆత్మీయంగా పరిచయం చేసుకుని, ఆటలో గెలుపోటములు సహజమని, ఓటమిని సవాలుగా తీసుకుని మరింత కృషి చేస్తే మంచి విజయాలు సాధించవచ్చని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు యువతలో ప్రతిభ, క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. యువత క్రీడలతో పాటు విద్యలో కూడా రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఖేడ్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివరాజ్, మద్వార్ సర్పంచ్ స్వరూప్ సంజీవులు, లింగనాయక్‌పల్లి సర్పంచ్ లక్ష్మి భూమయ్య, మద్వార్ తండా సర్పంచ్ సర్దార్, లింగాపూర్ సర్పంచ్ హనుమడ్లు, ఇడిగి రామగౌడ్, దుర్గయ్య, శంకర్, కృష్ణ, నాగయ్యతో పాటు గ్రామ ముఖ్య నాయకులు, యువకులు మరియు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మద్వార్ గ్రామంలో ఘనంగా క్రికెట్ ప్రీమియం టోర్నమెంట్ ప్రారంభించిన:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఖేడ్ మండలం మద్వార్ గ్రామంలో గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు నిర్వహించిన క్రికెట్ ప్రీమియం టోర్నమెంట్‌ను ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో ఆత్మీయంగా పరిచయం చేసుకుని, ఆటలో గెలుపోటములు సహజమని, ఓటమిని సవాలుగా తీసుకుని మరింత కృషి చేస్తే మంచి విజయాలు సాధించవచ్చని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు యువతలో ప్రతిభ, క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. యువత క్రీడలతో పాటు విద్యలో కూడా రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఖేడ్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివరాజ్, మద్వార్ సర్పంచ్ స్వరూప్ సంజీవులు, లింగనాయక్‌పల్లి సర్పంచ్ లక్ష్మి భూమయ్య, మద్వార్ తండా సర్పంచ్ సర్దార్, లింగాపూర్ సర్పంచ్ హనుమడ్లు, ఇడిగి రామగౌడ్, దుర్గయ్య, శంకర్, కృష్ణ, నాగయ్యతో పాటు గ్రామ ముఖ్య నాయకులు, యువకులు మరియు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News