Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:14 AM

మైనార్టీ స్మశాన వాటికకు స్థల కేటాయింపు కోరుతూ రాష్ట్ర కార్యదర్శిని కలిసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

16-12-2025 315 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మైనార్టీ స్మశాన వాటికకు స్థల కేటాయించాలి

రాష్ట్ర కార్యదర్శిని కలిసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్‌గిరి, స్థానికం ప్రతినిధి

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని మైనార్టీ ముస్లిం, క్రైస్తవ సముదాయాల ప్రజలకు స్మశాన వాటిక కోసం తగిన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ షఫీఉల్లా (IFS) ని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలో మైనార్టీ జనాభా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, స్మశాన వాటికకు సరైన స్థలం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. మానవీయ కోణాన్ని పరిగణనలోకి తీసుకుని వెంటనే స్థల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించాలని వినతి పత్రం ద్వారా కోరారు.

దీనిపై కార్యదర్శి శ్రీ షఫీఉల్లా సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మైనార్టీ వర్గాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సమావేశం ద్వారా సమస్య పరిష్కారానికి స్పష్టమైన ముందడుగు పడిందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Sthanikam

మైనార్టీ స్మశాన వాటికకు స్థల కేటాయింపు కోరుతూ రాష్ట్ర కార్యదర్శిని కలిసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

Article Image

మైనార్టీ స్మశాన వాటికకు స్థల కేటాయించాలి

రాష్ట్ర కార్యదర్శిని కలిసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్‌గిరి, స్థానికం ప్రతినిధి

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని మైనార్టీ ముస్లిం, క్రైస్తవ సముదాయాల ప్రజలకు స్మశాన వాటిక కోసం తగిన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ షఫీఉల్లా (IFS) ని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలో మైనార్టీ జనాభా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, స్మశాన వాటికకు సరైన స్థలం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. మానవీయ కోణాన్ని పరిగణనలోకి తీసుకుని వెంటనే స్థల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించాలని వినతి పత్రం ద్వారా కోరారు.

దీనిపై కార్యదర్శి శ్రీ షఫీఉల్లా సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మైనార్టీ వర్గాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సమావేశం ద్వారా సమస్య పరిష్కారానికి స్పష్టమైన ముందడుగు పడిందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News