Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:24 AM

లోన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్

15-05-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పోలేపాక వంశీ, ఘట్‌కేసర్‌కు చెందిన వేణుమాధవ్ కటకం అనే ఇద్దరు యువకులు వెంకటరెడ్డి అనే వ్యక్తిని నమ్మి మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు ఎనిమిది నెలలుగా పరిచయం పెంచుకున్న వెంకటరెడ్డి, స్నేహం పేరుతో వారి ఆధార్, పాన్, ఐటి రిటర్న్స్ వంటి పత్రాలు తీసుకుని వారి పేర్లపై లోన్లు ఇప్పించి వచ్చిన డబ్బులను ప్రామిసరీ నోట్ల ద్వారా తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బాధితులను బ్లాక్ చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న హ్యూమన్ రైట్స్ టీం సభ్యులు బాధిత కుటుంబాలతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం వెంకటరెడ్డి తండ్రి శ్రీకాంత్ రెడ్డితో చర్చించి బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరగా, వారు కొంత గడువు కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ మాట్లాడుతూ ప్రజలు లోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ అతి విశ్వాసంతో నమ్మి వ్యక్తిగత పత్రాలు ఇవ్వవద్దని సూచించారు. నిరుపేద కుటుంబాలకు హ్యూమన్ రైట్స్ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బద్దె వీరభద్రం, మిట్టపల్లి రాజకుమార్, వేణు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లోన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్

Article Image

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పోలేపాక వంశీ, ఘట్‌కేసర్‌కు చెందిన వేణుమాధవ్ కటకం అనే ఇద్దరు యువకులు వెంకటరెడ్డి అనే వ్యక్తిని నమ్మి మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు ఎనిమిది నెలలుగా పరిచయం పెంచుకున్న వెంకటరెడ్డి, స్నేహం పేరుతో వారి ఆధార్, పాన్, ఐటి రిటర్న్స్ వంటి పత్రాలు తీసుకుని వారి పేర్లపై లోన్లు ఇప్పించి వచ్చిన డబ్బులను ప్రామిసరీ నోట్ల ద్వారా తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బాధితులను బ్లాక్ చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న హ్యూమన్ రైట్స్ టీం సభ్యులు బాధిత కుటుంబాలతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం వెంకటరెడ్డి తండ్రి శ్రీకాంత్ రెడ్డితో చర్చించి బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరగా, వారు కొంత గడువు కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ మాట్లాడుతూ ప్రజలు లోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ అతి విశ్వాసంతో నమ్మి వ్యక్తిగత పత్రాలు ఇవ్వవద్దని సూచించారు. నిరుపేద కుటుంబాలకు హ్యూమన్ రైట్స్ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బద్దె వీరభద్రం, మిట్టపల్లి రాజకుమార్, వేణు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News