Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 06:28 AM

లోక్యతండా పాఠశాలకు వాటర్ కూలర్ బహూకరణ

లోక్యతండా పాఠశాలకు వాటర్ కూలర్ బహూకరణ

లోక్యతండా పాఠశాలకు వాటర్ కూలర్ బహూకరణ
21-02-2026 387 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని లోక్యతండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చల్లని తాగునీరు అందించేందుకు దాత తాటి శ్రీనివాస్ ముందుకు వచ్చారు. ఖమ్మం నగరం వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన ఆయన శనివారం నిర్వహించిన పేరెంట్-టీచర్స్ సమావేశంలో వాటర్ కూలర్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాదె వెంకన్నకు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సదుపాయం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి మరిన్ని దాతలు ముందుకు రావాలని కోరారు.

సర్పంచ్ వడ్యా వెంకటేశ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.

దాత తాటి శ్రీనివాస్‌ను సర్పంచ్ వడ్యా వెంకటేశ్, ఉపసర్పంచ్ నీలమ్మ, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుభద్ర, రవిరత్నం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లోక్యతండా పాఠశాలకు వాటర్ కూలర్ బహూకరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News