Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:35 PM

లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులకు త్వరిత పరిష్కారం – ప్రజలకు కలెక్టర్ సూచనలు

28-03-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి లో జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను త్వరితగతిన, సులభంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవాని చంద్రతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్, కుటుంబ, ఆస్తి, వైవాహిక, బ్యాంకు సంబంధిత వివాదాలు తదితర కేసులను ఇరువర్గాల పరస్పర అంగీకారంతో తక్కువ సమయంలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి, సమయం మరియు ఖర్చు ఆదా అవుతాయని చెప్పారు. చిన్న వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా కోర్టులపై భారం తగ్గడమే కాకుండా సమాజంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులకు త్వరిత పరిష్కారం – ప్రజలకు కలెక్టర్ సూచనలు

Article Image

సంగారెడ్డి లో జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను త్వరితగతిన, సులభంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవాని చంద్రతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్, కుటుంబ, ఆస్తి, వైవాహిక, బ్యాంకు సంబంధిత వివాదాలు తదితర కేసులను ఇరువర్గాల పరస్పర అంగీకారంతో తక్కువ సమయంలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి, సమయం మరియు ఖర్చు ఆదా అవుతాయని చెప్పారు. చిన్న వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా కోర్టులపై భారం తగ్గడమే కాకుండా సమాజంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News