Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:17 PM

లింగోజిగూడెంలో శ్మశానవాటిక స్థల పరిశీలన

లింగోజిగూడెంలో శ్మశానవాటిక స్థల పరిశీలన

లింగోజిగూడెంలో శ్మశానవాటిక స్థల పరిశీలన
10-04-2026 244 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వార్డు ప్రజల ఇబ్బందులు తీరుస్తాం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు (లింగోజిగూడెం)లో దీర్ఘకాలంగా వేధిస్తున్న శ్మశానవాటిక కొరతను తీర్చేందుకు మున్సిపల్ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా శుక్రవారం మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ సంబంధిత స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​గ్రామంలో సరైన శ్మశానవాటిక లేక అంత్యక్రియల సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానిక కౌన్సిలర్, నాయకులు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో కూడిన శ్మశానవాటిక ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. స్థల సేకరణ, నిధుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ వార్డు అధ్యక్షులు పర్నే శివారెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు తోర్పునూరి శ్రీకాంత్ గౌడ్,​మున్సిపల్ ఉపాధ్యక్షులు కళ్లెం దయాకర్ రెడ్డి,​నాయకులు బండమీది వెంకటేష్, కొమ్ము లక్ష్మయ్య,

​గ్రామశాఖ ఉపాధ్యక్షులు ఎర్రగోని నవీన్, మందోరి మహేష్,​ప్రధాన కార్యదర్శి బోసి బాబు, కార్యదర్శి తీగల రాజు, బాతరాజు శివ, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లింగోజిగూడెంలో శ్మశానవాటిక స్థల పరిశీలన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News