Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:13 PM

లేబర్ కోడ్స్ కార్మికుల మెడకు ఉరితాళ్లు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం

09-02-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కార్మికుల మెడలకు ఉరితాళ్లుగా మారిన నూతన లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక లోకమంతా పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు.సమ్మె విజయవంతం కోసం రామన్నపేట సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ కార్మిక వ్యతిరేకమని విమర్శించారు. నూతన చట్టాల ద్వారా తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించడమే కాకుండా, వారానికి 72 గంటల పనివేళలను ముందుకు తెచ్చి కార్మికుల హక్కులను అణిచివేస్తున్నారని ఆరోపించారు.కార్మికులు హక్కుల పరిరక్షణ కోసం సంఘటితంగా యూనియన్లుగా ఏర్పడకుండా అడ్డుకునే విధంగా ఈ లేబర్ కోడ్స్ రూపకల్పన చేశారని తెలిపారు. కార్మిక చట్టాలను ఖండిస్తూ కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. కార్మిక వ్యతిరేక, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులంతా ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.అన్ని రంగాలకు చెందిన కార్మికులు ఈ నెల 12న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మల్లేశం కోరారు.

ఈ సదస్సుకు సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బొడ్డుపల్లి వెంకటేశం అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరేకంటి రాము, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల బిక్షం, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వంగాల మారయ్య, ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ మండల గౌరవ అధ్యక్షుడు పల్లె సత్యం, జినుక లింగయ్య, గోగు మహేష్, చిత్రకంటి శోభ, పుట్టల నాగరాజు, నల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లేబర్ కోడ్స్ కార్మికుల మెడకు ఉరితాళ్లు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News