Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం-ఉగాది పచ్చడి పంపిణీ

19-03-2026 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ ముందర చలివేంద్రం ఏర్పాటు చేసి, ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ చింతల వెంకటరెడ్డి జ్ఞాపకార్థం, వారి కుమారుడు చింతల ప్రభాకర్ రెడ్డి – శ్వేత దంపతుల సౌజన్యంతో నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, సీఐ మన్మధ కుమార్ ప్రారంభించారు. అనంతరం భక్తులకు, ప్రజలకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది పర్వదినం సృష్టి ఆరంభానికి ప్రతీకగా భావిస్తారని, ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మన జీవితంలోని సుఖదుఃఖాలకు సూచికలని తెలిపారు. జీవితం లో ఎదురయ్యే అన్ని పరిస్థితులను సమానంగా స్వీకరిస్తూ, కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ పాక చిరంజీవి, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పోలోజు శ్రీనివాసచారి, ట్రస్ట్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్, కార్యదర్శి మోగుదాల రమేష్, కోశాధికారి గోశిక కరుణాకర్, క్లబ్ అధ్యక్షులు తిరందాసు జగన్నాథ్, కార్యదర్శి అతహర్ పాషా, కోశాధికారి సిలివేరు మంగయ్య, సభ్యులు ఉప్పు ఆంజనేయులు, కాసుల వెంకటేశం, కటకం ప్రశాంత్, చింతల ప్రభాకర్ రెడ్డి, కామిశెట్టి చంద్రశేఖర్, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, గోపగోని లక్ష్మణ్, దాచేపల్లి శ్రీనివాస్, వేముల నరసింహ, చింతల తిరుమలరెడ్డి, కృష్ణారెడ్డి, సత్యనారాయణ చారి, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం-ఉగాది పచ్చడి పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News