Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:32 PM

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ ల పంపిణీ

24-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

ప్రభుత్వ పాఠశాలలు పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలకు విద్యాభ్యాసానికి ప్రధాన కేంద్రాలుగా నిలుస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉన్నప్పటికీ, తాగునీటి అవసరాల కోసం విద్యార్థులు ఇంటి నుంచే నీటిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు వాడేసిన ప్లాస్టిక్ సీసాలు, శీతల పానీయాల సీసాలను ఉపయోగిస్తున్నారు.

ప్లాస్టిక్ సీసాల వినియోగం వల్ల మైక్రో ప్లాస్టిక్స్ చిన్నారుల శరీరంలోకి ప్రవేశించి జీర్ణకోశ సమస్యలతో పాటు మెదడుపై కూడా ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు రక్తంలో కలసి, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీయవచ్చని వారు పేర్కొంటున్నారు.

ఈ పరిస్థితిని నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ, ప్లాస్టిక్ సీసాలకు ప్రత్యామ్నాయంగా స్టీల్ సీసాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దాతలను సంప్రదించారు.

దీనికి స్పందించిన నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త గర్రె వెంకన్న ఝాన్సీ దంపతులు, తమ మనవరాలు ఆధ్య మొదటి పుట్టినరోజు సందర్భంగా పాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న 60 మంది విద్యార్థులకు పదివేల రూపాయల విలువైన స్టీల్ వాటర్ బాటిల్స్‌ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంటల వెంకటేశ్వర్లు, నకిరేకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్, వాసవి వనిత క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు బ్రహ్మదేవర పద్మావతి, వృద్ధాశ్రమ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు, క్లబ్ సెక్రటరీ సూర్యచంద్రరావు, ఉపాధ్యాయులు డి.ప్రభాకర్, ఎల్.నగేష్, టి.నర్సింహమూర్తి, జి.కల్పన, కె.విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన దాతలను, లయన్స్ క్లబ్ సభ్యులను పాఠశాల యాజమాన్యం ఈ సందర్భంగా అభినందించింది.

Sthanikam

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ ల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News