Sthanikam - Truth Matters
Logo

లారీ డ్రైవర్ కు గుండెపోటు రోడ్డుపైనె మృతి

Updated : 24 Jan 2026 17:55 IST
As Preferred Source 1 min read
లారీ డ్రైవర్ కు గుండెపోటు రోడ్డుపైనె  మృతి

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎండి నాసిర్ సన్నాఫ్ ఉస్మాన్ (61) అనే లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో చోటుచేసుకుంది.

సొంత లారీ కంటైనర్‌తో ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎండి నాసిర్, మార్గమధ్యంలో చిట్యాల మండల పరిధిలోని గుండ్రంపల్లి గ్రామ శివారులో ఉన్న జేబి వెంచర్ వద్దకు రాగానే ఛాతిలో నొప్పి వస్తోందని తన కూతురు గులాబ్ షాన్‌కు ఫోన్ ద్వారా తెలిపాడు. అనంతరం లారీని రోడ్డు పక్కకు ఆపి విశ్రాంతి తీసుకుంటుండగా, స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పరిశీలించగా, అప్పటికే గుండెపోటుతో నాసిర్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మృతుని కూతురు గులాబ్ షాన్ ఫిర్యాదు చేయగా, చిట్యాల ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Sthanikam

లారీ డ్రైవర్ కు గుండెపోటు రోడ్డుపైనె మృతి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news