Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:12 PM

లారీ ఢీకొని మేస్త్రి మృతి

లారీ ఢీకొని మేస్త్రి మృతి

లారీ ఢీకొని మేస్త్రి మృతి
10-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ సమీపంలోని తంగడపల్లి ఎక్స్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మేస్త్రి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన ఈసం సత్తయ్య (43), ప్రస్తుతం చౌటుప్పల్ రాంనగర్ కాలనీలో నివాసం ఉంటూ మేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తేదీ 09-03-2026న మేస్త్రి పని ముగించుకుని తంగడపల్లి నుండి ఆటోలో చౌటుప్పల్ వైపు వస్తూ తంగడపల్లి ఎక్స్ రోడ్ వద్ద దిగాడు. అక్కడ నుండి నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా రాత్రి సుమారు 9 గంటల సమయంలో చిట్యాల నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ లారీ (TS 07UG 9396) డ్రైవర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో సత్తయ్య రోడ్డుపై పడిపోవడంతో తల వెనుక భాగంలో తీవ్ర రక్తగాయం, శరీరంలోని ఇతర భాగాలకు గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యుడు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.మృతుడి అన్నయ్య ఈసం బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ జి. మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

లారీ ఢీకొని మేస్త్రి మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News