Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

లారీ డ్రైవర్ అతివేగం.. బాలిక నిండు ప్రాణం బలి

15-02-2026 228 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని లింగోజిగూడెం శివారులో హైవే 9 హోటల్ వద్ద శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త ఓ బాలిక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటనతో మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఆరెగూడెం గ్రామానికి చెందిన వడ్డేగోని రమేష్ (33) తన పెద్ద కుమార్తె వడ్డెగోని రిహాన్సిక (9) తో కలిసి బైక్ పై స్వగ్రామానికి వెళ్తున్నారు.మార్గ మధ్యలో లింగోజిగూడెం హైవే 9 హోటల్ సమీపానికి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనతో బాలిక రిహాన్సిక లారీ వెనుక టైర్ల కింద పడిపోయింది. లారీ అదే వేగంతో ముందుకు దూసుకెల్లడంతో చిన్నారి తల ఛిద్రమై అక్కడీకక్కడే మృతి చెందింది. తండ్రి రమేష్ తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కన పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన రమేష్ ను 108 అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె రిహాన్సిక రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో తల్లి మౌనిక రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నిరయ్యారు. బాలిక తల్లి మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై డి నర్సిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

లారీ డ్రైవర్ అతివేగం.. బాలిక నిండు ప్రాణం బలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News