Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువు ఋణం తీర్చుకున్న శిష్యుడు! ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం. రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 08:57 PM

లక్ష కు ఐదు లక్షల నకిలీ నోట్లు!

లక్ష కు ఐదు లక్షల నకిలీ నోట్లు!

లక్ష కు ఐదు లక్షల నకిలీ నోట్లు!
April 09, 2026 07:42 PM 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్ల రంగు కాగితాలతో మోసం చేస్తూ

అమాయకులకు కుచ్చుటోపి

విదేశీ కేటుగాడి అరెస్ట్..

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..


నల్లగొండ : రంగు పూసిన కాగితాలను రసాయనంతో కడిగితే అసలు నోట్లుగా మారుతాయని నమ్మబలికి అమాయకులను మోసం చేస్తున్న పశ్చిమ ఆఫ్రికాకు చెందిన నిందితుడిని తిప్పర్తి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ కేసు వివరాలను వెల్లడించారు. పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశానికి చెందిన గోయిటా సౌంగాలో (53) రెండేళ్ల క్రితం భారత్‌కు వచ్చాడు.

తొలుత బెంగళూరులో పండ్లు విక్రయిస్తూ జీవనం సాగించిన అతడు అనంతరం హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతానికి మకాం మార్చాడు.

జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మరో నిందితుడు సల్మాన్ అలియాస్ ఉమా దాలియాతో కలిసి నకిలీ కరెన్సీ పేరుతో మోసాలకు తెరలేపాడు. వాట్సాప్ ద్వారా అమాయకులను సంప్రదించి ఒక లక్ష అసలు రూపాయలకు ఐదు లక్షల విలువైన 500 నోట్లు ఇస్తామని నమ్మబలికేవారు. నల్ల రంగు పూసిన నోట్లను ప్రత్యేక రసాయనంతో కడిగి అసలు నోట్లుగా మార్చి ప్రదర్శన ఇచ్చి బురిడీ కొట్టించేవారు.ఈ నెల 6న తిప్పర్తి మండలం మల్లేపల్లి వారిగూడెం దాబా వద్ద వంగూరి జానయ్య అనే వ్యక్తికి రూ. 5 లక్షల విలువైన కరెన్సీ కట్ట అని చెప్పి రూ. లక్ష వసూలు చేశారు. పైభాగంలో నాలుగు అసలు నోట్లు పెట్టి లోపల నల్లటి కాగితాలు ఇచ్చారు. ఇంటికి వెళ్లి రసాయనంతో కడిగినా అవి మారకపోవడంతో జానయ్య తాను మోసపోయినట్లు గుర్తించాడు. నిందితుడిని పట్టుకోవాలని పథకం పన్ని తన స్నేహితుడు అభిరామ్ సహాయంతో మరో రూ. 10 లక్షల నోట్లు కావాలని నిందితుడిని సంప్రదించాడు. గురువారం మధ్యాహ్నం తిప్పర్తి రైల్వే స్టేషన్ వద్దకు వచ్చిన నిందితుడిని బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.​


రసాయనాలు, నకిలీ కాగితాల స్వాధీనం..

​నిందితుడి నుంచి నాలుగు కట్టల నల్లటి కాగితాలు, రసాయన ద్రావణం, పౌడర్, ఒక మొబైల్ ఫోన్ మరియు నాలుగు అసలు 500 రూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వీసా గడువు 2024 ఆగస్టులోనే ముగిసినట్లు గుర్తించారు. గతంలో ఇతనిపై మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ కొండల్ రెడ్డి, ఎస్సై శంకర్ మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. తక్కువ డబ్బుకు ఎక్కువ కరెన్సీ ఇస్తామనే మోసగాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News