Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:41 AM

లక్ష్మీపురంలో బిఆర్ఎస్ జెండా ఎగిరింది

లక్ష్మీపురంలో బిఆర్ఎస్ జెండా ఎగిరింది

లక్ష్మీపురంలో బిఆర్ఎస్  జెండా ఎగిరింది
15-12-2025 171 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల రెండో విడతలో పులి పలుపుల సునీత–వీరస్వామి దంపతులు సంచలన విజయం సాధించారు. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన సునీత భారీ మెజార్టీతో గెలుపొందుతూ గ్రామ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేపారు.

గత ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్న సునీత ఈసారి ప్రజల నమ్మకాన్ని సంపాదించి ఘన విజయం సాధించడం విశేషం. ఆశా వర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి స్థాయిలో ప్రజాసేవే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆమె నిర్ణయానికి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రతి ఇంటికీ న్యాయం చేయాలనే స్పష్టమైన దృక్పథంతో ముందుకెళ్లిన సునీతకు మహిళలు, యువత పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఫలితంగా లక్ష్మీపురంలో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించగా, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఈ విజయం గ్రామంలో ప్రజాసేవకు పట్టం కట్టిన నాయకత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Sthanikam

లక్ష్మీపురంలో బిఆర్ఎస్ జెండా ఎగిరింది

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News