Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:49 PM

లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

19-01-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరిక

సామాజిక మాధ్యమాల్లో కొత్త మోసాల

నిర్వహించినా… ప్రోత్సహించినా కఠిన చర్యలు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. బెట్టింగ్ యాప్‌లపై రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకోవడంతో ఆ దందాకు దాదాపు బ్రేక్ పడిందని, అయితే ఇప్పుడు కొందరు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని లక్కీ డ్రాల పేరుతో కొత్త రకమైన మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కార్లు, బైకులు, ఖరీదైన గ్యాడ్జెట్లు ఇస్తామని ప్రచారం చేస్తూ అమాయక ప్రజలను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలోని పలు ముఖ్య నగరాలు, పట్టణాల్లో లక్కీ డ్రాల పేరుతో మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు పోలీసులకు అందుతున్నాయని పేర్కొన్నారు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ప్రభావం కలిగిన వ్యక్తులు తమ అనుచరులను ఉపయోగించుకుని డ్రాలో పాల్గొంటే తప్పకుండా బహుమతి వస్తుందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే ఇలాంటి డ్రాలకు ఎలాంటి చట్టబద్ధత లేదని, చివరికి ప్రజలు మోసపోయి బహుమతులు అందకుండా నష్టపోతున్నారని స్పష్టం చేశారు. లక్కీ డ్రాల పేరుతో డబ్బులు వసూలు చేయడం, లాభాల ఆశ చూపించి ప్రజలను మోసం చేయడం నేరమని తెలిపారు. ఈ తరహా కార్యకలాపాలు ప్రైజ్ చిట్స్ మరియు మనీ సర్క్యులేషన్ పథకాల నిషేధ చట్టం కింద నేరంగా పరిగణించబడతాయని వెల్లడించారు. చట్టాన్ని అతిక్రమించి లక్కీ డ్రాలు నిర్వహించే వారిపై, వాటిని ప్రోత్సహించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి మోసాలకు పాల్పడిన వారిపై, వాటిని ప్రచారం చేసిన ఎంతమందిపైనైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

Sthanikam

లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News