Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

లక్కారం రైతులకు ఊపిరి… లిఫ్ట్ స్కీమ్ పనులకు శ్రీకారం

12-03-2026 408 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దివిస్ పరిశ్రమ సి ఎస్ ఆర్ నిధులతో రూ.1.06 కోట్లు – పిల్లయపల్లి కాలువ నుంచి లోద్ది కుంట, గంగదేవి కుంటలకు నీరు

మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదేశానుసారం దివిస్ పరిశ్రమ వారి సౌజన్యంతో పిల్లయపల్లి కాలువ నుండి పైపులైన్ వేసి లిఫ్ట్ ద్వారా లోద్ది కుంట, గంగదేవి కుంటలను నీటితో నింపే పనులను కాలువ కమిటీ అధ్యక్షుడు,చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేన రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కాలువ సాధన కమిటీకి చెందిన రైతులు కలిసి మునుగోడు ఎమ్మెల్యేను కలవగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే స్థానిక దివిస్ పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి వారి సి ఎస్ ఆర్ నిధుల ద్వారా లిఫ్ట్ స్కీమ్ మంజూరు చేయించారు. దీని వల్ల ఈ ప్రాంతంలో ఉన్న బీడు భూములు సాగుభూములుగా మారే అవకాశం కలిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.లిఫ్ట్ స్కీమ్ కోసం కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్ కింద రూ.1 కోటి 6 లక్షల నిధులను మంజూరు చేసిన దివిస్ పరిశ్రమకు, రైతుల సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యేకు లక్కారం గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివిస్ పరిశ్రమ సి ఎస్ ఆర్ విభాగం ప్రతినిధి గోపి, 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బద్రిగాలయ్య, మాజీ ఎంపీటీసీ కాసార్ల శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కొయ్యడ సైదులు గౌడ్, గ్రామ పెద్దలు దుబ్బాక శ్రీనివాస్ రెడ్డి, గుండెబోయిన నర్సింహా యాదవ్, సూరకంటి మధుసూదన్ రెడ్డి, ఆకుల తిరుమల్ రెడ్డి, మునుకుంట్ల మల్లేశం గౌడ్, రాసాల ఐలయ్య, మునుకుంట్ల యాదయ్య గౌడ్, గంటిల యాదయ్య, తోటకూర రాములు యాదవ్, గోపనబోయిన పెద్దపెంటయ్య, తోటకూర జంగయ్య, సూరకంటి రాఘవ రెడ్డి, పాశం రాజేష్, ఆకుల యాదిరెడ్డి, రాసాల రవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లక్కారం రైతులకు ఊపిరి… లిఫ్ట్ స్కీమ్ పనులకు శ్రీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News