Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:22 AM

లీగల్ సర్వీసెస్ అధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ డే

12-12-2025 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల, రామన్నపేట ఆసుపత్రులలో నిర్వహణ

హాజరైన ప్యానల్ అడ్వకెట్లు, డాక్టర్లు

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

లీగల్ సర్వీసెస్ అథారిటీ అధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ డే కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా అదేశాలనుసారం, మండల న్యాయ సేవ అధికార సంస్థ రామన్నపేట అధ్వర్యంలో మండల పరిధిలోనీ మునిపంపులలో గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆశ్విన్ కుమార్, డాక్టర్ కల్యాణి ల సమక్షంలో లీగల్ సర్వీసెస్ టీమ్ సభ్యులు బత్తుల గణేష్, కానుగంటి శ్రీశైలం, కోక సబిత లు కలిసి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే -2025 సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అనంతరం అక్కడ న్యాయ సేవా అధికార సంస్థ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు డాక్టర్ దేవేందర్, డాక్టర్ మాధవ చారి ల సమక్షంలో ప్యానల్ లాయర్ మామిడి వెంకట్ రెడ్డి, గడ్డం నర్సింహ, వాలంటీర్ లు బత్తుల గణేష్, కానుగంటి శ్రీశైలం, కోక సబిత లు హాజరై కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా న్యాయ సేవల అధికార సంస్థ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి, ఆరోగ్య శాఖ అధికారుల సమన్వయంతో ప్రజలకు చట్టపరమైన, ముఖ్యంగా మాతాశిశు ఆరోగ్యం, అత్యవసర సేవలు మరియు ఉచిత చికిత్స అందుబాటులో ఉన్న వ్యాధులకు సంబంధించిన హక్కులను తెలియజేసి, జాతీయ ఆరోగ్య పథకాల కింద ఉచిత చికిత్స గురుంచి తెలిపి న్యాయ సేవా అధికార సంస్థ పనులు, ఉపయోగం, వినియోగంలో తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు రెండు ఆసుపత్రులలో గల డాక్టర్లు, వైద్య సిబ్బంది, సిస్టర్స్, స్టాఫ్ నర్స్, శానిటేషన్ సిబ్బంది, వివిధ విభాగాల నుండి సిబ్బంది, ఒపి కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలు, జనరల్ వార్డులో ఉన్న పేషెట్లు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లీగల్ సర్వీసెస్ అధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ డే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News