Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:25 AM

లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తక పఠనంతో చరిత్రపై అవగాహన పెరుగుతుంది.

16-05-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: పుస్తకాలను నిరంతరం చదవడం ద్వారా విజ్ఞానం పెరుగుతుందని, ప్రపంచ చరిత్ర, సమాజ పరిణామాలను అర్థం చేసుకోవచ్చని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ, న్యాక్ మాజీ డైరెక్టర్ ప్రొ. వి.ఎస్. ప్రసాద్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన “బుక్ టాక్” కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా రాజ్‌మోహన్ గాంధీ రచించిన “డు యు నో యువర్ హిందూయిజం” పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ భారతదేశం లౌకిక దేశమని, అన్ని మతాలను పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజమైన హిందూయిజం ఇతర మతాల ఆచారాలను కూడా గౌరవించాలని చెబుతోందని వివరించారు.

పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ ఆచార్యులు ప్రొ. జి. హరగోపాల్ మాట్లాడుతూ టి.ఎం. కృష్ణ రచించిన “వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా: డీకోడింగ్ ఏ నేషన్ సింబల్స్” పుస్తకాన్ని ప్రస్తావించారు. దేశ చరిత్ర, రాజ్యాంగ విలువలను అర్థం చేసుకోవాలంటే విద్యార్థులు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమానికి వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించారు. లైబ్రరీలు విద్యార్థుల పరిశోధన, విజ్ఞానాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో ప్రొ. జి. పుష్పా చక్రపాణి, డా. ఎల్. విజయకృష్ణారెడ్డి, ప్రొ. రజని, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తక పఠనంతో చరిత్రపై అవగాహన పెరుగుతుంది.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News