Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:30 AM

లారీ–బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి

లారీ–బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి

లారీ–బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి
04-01-2026 449 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మోత్కూర్ స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాపురం గ్రామం సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. కాలేజీకి వెళ్లే క్రమంలో పల్సర్ బైక్‌పై భువనగిరి వైపు వెళ్తున్న ఇద్దరు యువకులను వలిగొండ ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసుల వివరాల ప్రకారం… ఈ ప్రమాదంలో మోత్కూర్ మండలం దాచారం గ్రామానికి చెందిన బోళ్ల దీక్షిత్ (తండ్రి: లేట్ బోళ్ల సంపత్) మరియు దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కుక్కల సాయికుమార్ (తండ్రి: కుక్కల యాదగిరి) మృతిచెందారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో ఇద్దరూ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఘటన విషయం తెలిసిన వెంటనే మృతుల బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఇరు కుటుంబాల్లోనూ ఒక్కగానొక్క కొడుకులే కావడంతో వారి మృతి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. తల్లిదండ్రుల ఆర్తనాదాలు అక్కడున్నవారి హృదయాలను కలచివేశాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.ఈ ప్రమాదం వలిగొండ ప్రధాన రహదారిపై వాహనాల వేగ నియంత్రణ, రోడ్డు భద్రత చర్యలపై మరోసారి గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. నిర్లక్ష్యం, అతివేగం యువ ప్రాణాలను బలి తీసుకుంటున్నాయనే వాస్తవానికి ఇది మరో విషాదకర ఉదాహరణగా నిలిచింది.

Sthanikam

లారీ–బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News