Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తమ్ముడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్క సువర్ణ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:55 AM

కుష్ఠు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

10-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండల పరిధిలోని కొమ్మాయిగూడెం గ్రామపంచాయతీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సును హెచ్ఐవో గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా హెచ్ఐవో గోపాల్ మాట్లాడుతూ, కుష్ఠు వ్యాధి ప్రాణాంతకమైనది కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే శాశ్వత అంగవైకల్యానికి దారి తీసే వ్యాధి అని తెలిపారు. కుష్ఠు వ్యాధి కేసులు గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి పూర్తిస్థాయి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కుష్ఠు వ్యాధి లక్షణాలు, ఉచిత చికిత్స సౌకర్యాలు, మందుల వినియోగం, అంగవైకల్యం నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులు, ప్రజాప్రతినిధులకు వివరించారు.

అనంతరం కుష్ఠు వ్యాధి నిర్మూలనలో భాగస్వాములుగా నిలవాలని విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో కొమ్మాయిగూడెం గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ, జెడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మురళీధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఏఎసీం సాదియా, ఆశ వర్కర్ కళావతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కుష్ఠు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News