Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:50 AM

కుప్పిరెడ్డిగూడెంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

కుప్పిరెడ్డిగూడెంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

కుప్పిరెడ్డిగూడెంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక
February 04, 2026 06:50 PM 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


బిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కనుక రేణుకకు ఘన స్వాగతం

సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని కుప్పిరెడ్డిగూడెం పదవ వార్డులో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు కనుక రేణుక కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఆ ఆకర్షణతోనే వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారని అన్నారు.

కనుక రేణుక మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు. కుప్పిరెడ్డిగూడెం వార్డు అభివృద్ధి కోసం, ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనుక రేణుకకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News