Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:49 AM

కుక్క కాటుతో మహిళకు గాయాలు

కుక్క కాటుతో మహిళకు గాయాలు

కుక్క కాటుతో మహిళకు గాయాలు
09-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వాకింగ్‌కు వెళ్లిన జయలక్ష్మిపై దాడి – ప్రజల్లో భయం

సూర్యాపేట పట్టణంలో కుక్కల కాటుతో రోజురోజుకు అధికమవుతోంది. ఉదయం వేళ వాకింగ్‌కు వెళ్లే ప్రజలు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో అనేకసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గురువారం జయలక్ష్మి అనే మహిళ సూర్యాపేటలోని ఉన్నత యోగ శిక్షణ కేంద్రానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క దాడి చేసి గాయపరిచింది. దీంతో అక్కడున్న ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ఆరోగ్యం కోసం నడకకు వెళ్లే ప్రజలకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, అక్కడికి వెళ్లాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది.

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కుక్కలు ఆందోళనకు గురై దాడులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, కొత్త పాలకవర్గం వెంటనే చర్యలు తీసుకొని ప్రజల భద్రతను కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Sthanikam

కుక్క కాటుతో మహిళకు గాయాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News