Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:11 PM

కోతుల బెడదకు చెక్ సొంత నిధులతో రంగంలోకి దిగిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

10-02-2026 205 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న కోతుల బెడదకు అడ్డుకట్ట వేసేందుకు గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ నడుం బిగించారు. గ్రామ ప్రజల కష్టాలు చూడలేక, ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడకుండా సొంత నిధులతో కోతుల నివారణ చర్యలు చేపట్టారు.నిత్యం కోతుల కారణంగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతుండగా, పలువురు కోతుల దాడుల్లో గాయపడిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోతులను బోన్లలో పట్టించి అటవీ ప్రాంతాలకు తరలిస్తూ, అక్కడ వాటికి సహజ జీవనం కలిగేలా విడిచిపెట్టే చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, కోతుల బెడద పూర్తిగా తగ్గే వరకు చర్యలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువతతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

కోతుల బెడదకు చెక్ సొంత నిధులతో రంగంలోకి దిగిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న కోతుల బెడదకు అడ్డుకట్ట వేసేందుకు గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ నడుం బిగించారు. గ్రామ ప్రజల కష్టాలు చూడలేక, ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడకుండా సొంత నిధులతో కోతుల నివారణ చర్యలు చేపట్టారు.నిత్యం కోతుల కారణంగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతుండగా, పలువురు కోతుల దాడుల్లో గాయపడిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోతులను బోన్లలో పట్టించి అటవీ ప్రాంతాలకు తరలిస్తూ, అక్కడ వాటికి సహజ జీవనం కలిగేలా విడిచిపెట్టే చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, కోతుల బెడద పూర్తిగా తగ్గే వరకు చర్యలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువతతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News