Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

కొత్తపల్లి గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేను కలిసిన ప్రజలు

Updated : 14 Jan 2026 17:49 IST
As Preferred Source 1 min read
కొత్తపల్లి గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేను కలిసిన ప్రజలు

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే స్వగృహంలో బుధవారం నారాయణఖేడ్ మండలంలోని కొత్తపల్లి గ్రామ ప్రజలు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి తమ గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను వివరించారు. ముఖ్యంగా గ్రామంలో త్రాగునీటి సమస్య, రోడ్డు సదుపాయం,ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం,అలాగే ఖంజీపూర్ గ్రామపంచాయతీ నుంచి కొత్తపల్లిని వేరు చేసి ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలనే అంశాలపై వారు విజ్ఞప్తి చేశారు.గ్రామ ప్రజల వినతులకు స్పందించిన శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ, కొత్తపల్లి గ్రామంలో రోడ్డు సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.త్రాగునీటి సమస్య పరిష్కారానికి బోరు బావి మంజూరు చేసి నీటి ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇచ్చారు.గ్రామంలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయించి వీధి వెలుగుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే కొత్తపల్లికి ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని, ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యపై సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపుతామని అన్నారు.ఈ సమావేశంలో కొత్తపల్లి గ్రామ పెద్దలు, ఖంజీపూర్ గ్రామ సర్పంచ్, గ్రామ నాయకులు, పలువురు స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

కొత్తపల్లి గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేను కలిసిన ప్రజలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news