Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:24 AM

కొత్తూర్ (బీ)లో ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం

16-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్ (బీ) గ్రామ శివారులో ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ క్రషింగ్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఫ్యాక్టరీని మహారాష్ట్రకు చెందిన ఓంకార్ సఖర్ కార్ఖానా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కొనుగోలు చేసి, మరమ్మతులు పూర్తి చేసి క్రషింగ్ ప్రారంభానికి చర్యలు చేపట్టింది. ఇటీవల ఫ్యాక్టరీ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ట్రయల్ క్రషింగ్ చేశారు.1972–73లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలంలో నిజాం షుగర్ పేరుతో ఈ ఫ్యాక్టరీ స్థాపించబడింది. జహీరాబాద్–బీదర్ రహదారి పక్కన సుమారు 132 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఫ్యాక్టరీ రోజుకు 1250 టన్నుల చెరుకు క్రషింగ్ సామర్థ్యంతో పనిచేసేది. తరువాత ప్రైవేటీకరణ అనంతరం క్రషింగ్ సామర్థ్యాన్ని 3500 టన్నులకు పెంచారు. అయితే యాజమాన్య మార్పులు, ఆర్థిక సమస్యల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఫ్యాక్టరీ మూతపడింది.ఇటీవల ఓంకార్ సఖర్ కార్ఖానా యాజమాన్యం ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని యంత్రాలకు మరమ్మతులు చేసి క్రషింగ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యాజమాన్యం, గ్రామ సర్పంచ్ ప్రతినిధులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫ్యాక్టరీ డైరెక్టర్ మాట్లాడుతూ ఇతర షుగర్ ఫ్యాక్టరీలు ఇచ్చే మద్దతు ధర కంటే అధిక ధర రైతులకు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూతపడ్డ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం కానుండడంతో జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

కొత్తూర్ (బీ)లో ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News