Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:36 AM

కొత్తగూడెం గ్రామంలో నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణ ల ఆధ్వర్యంలో పల్లె - నిద్ర కార్యక్రమం

20-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 20(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) నూజివీడు రూరల్ సీఐ కె. రామ కృష్ణ, చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణ ఇతర శాఖల అధికారు లతో కలిసి చాట్రాయి మండలం కొత్త గూడెం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంను నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్థులతో ముఖా ముఖి సమావేశం నిర్వహించి, వారి భద్రత, సమస్యలు, నేర నివారణ విషయాలపై చర్చిం చారు. ముఖ్యంగా సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. బ్యాంకు పేరుతో వస్తున్న ఫేక్ మెసేజ్లు, ఆధార్ అప్డేట్ మోసాలు, ఫేక్ లింక్‌లు క్లిక్ చేయడం వలన డేటా చోరీ. లాటరీ గెలిచినట్లు మెసేజ్‌ల ద్వారా OTP అడిగి డబ్బు మాయం చేసే మోసాల గురించి హెచ్చరించారు.ఇలాంటి సందర్భా ల్లో సైబర్ హెల్ప్‌లైన్ 1930 లేదా టోల్ ఫ్రీ నెంబర్ కు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆపద సమయం లో డయల్ 112 కు ఫోన్ చేస్తే 15–20 నిమిషాల్లో సహాయం అందించబడుతుందని, గ్రామాలలో చిన్న చిన్న సమస్యలు తలెత్తిన సమయాలలో పోలీసు వారికి తెలియజేసిన యెడల సదరు సమస్యలను పరిష్కరించబడతాయని అది శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పరిష్కార మార్గాలను పోలీసు వారు తీసుకుంటారని తెలియ జేశారు ప్రతి ఒక్కరూ సీసీటీవీ లను ఏర్పాటు చేసుకోవడం వలన నేర దర్యాప్తు సమయాలలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, గ్రామాలలో కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా సదరు వ్యక్తులు యొక్క వివరాలను సేకరించడం వలన దొంగతనాలు నివారించవచ్చని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాదాల సమయంలో ఇది ప్రాణరక్షకంగా ఉంటుందని వివరించారు. మైనర్లు ద్విచక్ర వాహనాలను నడిపితే వారిపై జరిమానా విధించడమే కాకుండా వారికి 25 సంవత్సరా లు వయసు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా నియమ నిబంధనలు ఉన్నట్లు, సదరు మైనర్ల కుటుంబ పెద్ద పై కూడా కేసులను నమోదు చేస్తారని,గంజాయి, మత్తు పదార్థాలు, ఇసుక అక్రమ రవాణా వంటి అంశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం ఇవ్వాలని సూచించారు."పల్లె నిద్ర" కార్యక్రమం ప్రజలతో పోలీసులకు మానవీయ సత్సంబంధాలను పెంచడమే కాకుండా, భద్రతా పరిరక్షణ, చట్టాలపై అవగాహన, సామాజిక సమగ్రత అనే మూడు దిశల్లో సమగ్ర ప్రయోజనం అందించుట కొరకు ఇదే తరహా కార్యక్రమాలను నూజివీడు రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న మరిన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలియ జేశారు

Sthanikam

కొత్తగూడెం గ్రామంలో నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణ ల ఆధ్వర్యంలో పల్లె - నిద్ర కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News