Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రెండు గంటల్లోనే వాహన దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:25 PM

కూసుమంచి మండలంలో విస్తృతంగా యూరియా పంపిణీ

13-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఒక్కరోజే 4,813 బస్తాల సరఫరా – రైతులు ముందస్తుగా నమోదు చేసుకోవాలి

కూసుమంచి: కూసుమంచి మండలంలోని జీళ్ల చెరువు, చేగొమ్మ సహకార సంఘ కేంద్రాలలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని డివిజన్ సహాయ సంచాలకులు సతీష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రైతులకు సరిపడినంత యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. సహకార సంఘ కేంద్రాలు మరియు ప్రైవేటు ఎరువుల దుకాణాల ద్వారా యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు.శుక్రవారం ఒక్కరోజే 4,813 బస్తాల యూరియా నమోదిత విధానంలో రైతులకు అందించామని తెలిపారు. యూరియా అవసరమైన రైతులందరూ ఎరువుల నమోదు విధానం ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ ద్వారా ఏ కేంద్రంలో ఎరువులు అందుబాటులో ఉన్నాయో ముందుగానే రైతులకు సమాచారం అందజేస్తున్నామని పేర్కొన్నారు.నమోదు చేసుకోవడం తెలియని రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారులు, ఎరువుల దుకాణాల సిబ్బంది, వాలంటీర్లు సహాయం అందిస్తారని తెలిపారు. అనంతరం జీళ్ల చెరువు గ్రామంలోని రైతులతో మాట్లాడిన ఆయన, ప్రతి రైతు తమ పంట వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద నమోదు చేయించుకోవాలని సూచించారు.ఇంకా నమోదు పూర్తి చేయని రైతులు వెంటనే వ్యవసాయ విస్తరణ అధికారిని లేదా మీ సేవా కేంద్రాలను సంప్రదించి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, వ్యవసాయ విస్తరణ అధికారులు రవీందర్, రవి కుమార్, సహకార సంఘ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

Sthanikam

కూసుమంచి మండలంలో విస్తృతంగా యూరియా పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News