Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:33 AM

కూలీ నుంచి గ్రూప్–2 వరకూ… విజయలక్ష్మి స్ఫూర్తిదాయక విజయ గాథ

31-01-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నంద్యాల జిల్లా: కష్టాలు ఎంత పెద్దవైనా, పట్టుదల ఉంటే విజయాన్ని ఆపలేవని మరోసారి నిరూపించింది రుద్రవరం మండలం యల్లావత్తుల గ్రామానికి చెందిన విజయలక్ష్మి. రోజంతా కూలీ పనులు చేసి, రాత్రిళ్లు చదువుకుంటూ చివరకు గ్రూప్–2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO) గా ఎంపికై అనేక మందికి స్ఫూర్తిగా నిలిచింది.పేద కుటుంబంలో జన్మించిన విజయలక్ష్మికి చిన్ననాటి నుంచే జీవితం పోరాటమే. కుటుంబ అవసరాల కోసం కూలీ పనులు చేయాల్సి వచ్చేది. అయితే చదువు ద్వారా జీవితాన్ని మార్చుకోవాలనే లక్ష్యాన్ని ఆమె ఎప్పుడూ వదల్లేదు. రోజంతా శ్రమించి అలసిపోయినా, రాత్రివేళల్లో పుస్తకాలే ఆమెకు తోడయ్యాయి.ఇంతలో కుటుంబానికి మరో పెద్ద దెబ్బ తగిలింది. ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆమె భర్త ప్రమాదానికి గురి కావడంతో ఆర్థిక సమస్యలు మరింత పెరిగాయి. కుటుంబ బాధ్యతలన్నీ విజయలక్ష్మి భుజాలపై పడ్డాయి. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఆశలు వదిలేసే సమయంలో, ఆమె మాత్రం మరింత ధైర్యంగా నిలబడి ముందుకు సాగింది.కుటుంబాన్ని చూసుకుంటూనే చదువుకు సమయం కేటాయిస్తూ, ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని నిరంతర సాధన చేసింది. అనేక ఆటంకాలు ఎదురైనా, చివరకు ఆమె కృషికి ఫలితం దక్కి గ్రూప్–2లో ASOగా ఎంపికయ్యారు.విజయలక్ష్మి విజయం గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. కూలీ పనుల నుంచి ప్రభుత్వ ఉద్యోగం వరకూ వచ్చిన ఆమె ప్రయాణం గ్రామీణ యువతకు, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు గొప్ప స్ఫూర్తిగా మారింది.పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి.కానీ మన పట్టుదలే మన విజయాన్ని నిర్ణయిస్తుంది” అని విజయలక్ష్మి ప్రయాణం స్పష్టంగా చెబుతోంది.

Sthanikam

కూలీ నుంచి గ్రూప్–2 వరకూ… విజయలక్ష్మి స్ఫూర్తిదాయక విజయ గాథ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News