Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సిపిఎం పార్టీ పోరాట ఫలితమే నేడు రైతులకు భూమి పట్టాలు ;మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:11 PM

కొలువుదీరిన పురపాలక పాలకులు

కొలువుదీరిన పురపాలక పాలకులు

కొలువుదీరిన పురపాలక పాలకులు
16-02-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నూతన మేయర్‌లు, చైర్మన్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుభాకాంక్షలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు నూతనంగా ఎన్నికైన మేయర్‌లు, చైర్మన్లు, ఉప మేయర్‌లు, ఉప చైర్మన్లు, సభ సభ్యులు, విభాగ సభ్యులకు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఈ నూతన ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణాల అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగూడెం నగరపాలక సంస్థ తొలి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన మూడ్ గణేష్ , ఉప మేయర్‌గా ఎన్నికైన సిరిపురపు లలిత కి మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన పురపాలక సంఘాల చైర్మన్లు, ఉప చైర్మన్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

మధిర పురపాలక సంఘ చైర్మన్ సామినేని సుజాత, ఉప చైర్మన్ కోట ధనమూర్తి , సత్తుపల్లి చైర్మన్ రెహానా బేగం, ఉప చైర్మన్ బొంతు సుమలత, వైరా చైర్మన్ కాపా చంద్రకళ , ఉప చైర్మన్ కట్ల సంతోష్ , అశ్వారావుపేట చైర్మన్ జూపల్లి శశికళ , ఉప చైర్మన్ జూపల్లి రమేష్, ఏదులాపురం చైర్మన్ పోకబత్తిని అనిత, ఉప చైర్మన్ తమ్మినేని నవీన్, కల్లూరు పురపాలక సంఘ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, ఉప చైర్మన్ శీలం కోటేశ్వరి కు మంత్రి అభినందనలు తెలిపారు. పట్టణాల్లోని ప్రతి వార్డు, ప్రతి విభాగం అభివృద్ధి చెందాలంటే సభ సభ్యులంతా సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు.

Sthanikam

కొలువుదీరిన పురపాలక పాలకులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News