Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

కొలనుపాక గ్రామ పంచాయతీ కార్యాలయాన్నీఅదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

16-03-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మార్చి 31లోపు ఇంటి పన్ను100శాతం వసూలు చేయాలని అధికారులకు ఆదేశం.

ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కార్యాలయ నిర్వహణ,రికార్డుల నిర్వహణ విధానాన్ని పరిశీలించారు.సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించిన ఆయన గ్రామ ప్రజలకు సమయానికి సేవలు అందేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఇంటి పన్ను వసూలు అత్యంత ముఖ్యమని తెలిపారు.గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మార్చి 31వ తేదీ లోపు 100 శాతం పన్ను వసూలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.గడువులోపు పన్ను వసూలు పూర్తికాకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అభివృద్ధి పనులు సమర్థవంతంగా కొనసాగాలంటే ఆదాయ వనరులు పెరగడం అవసరమని పేర్కొన్నారు.అనంతరం గ్రామ నర్సరీలను సందర్శించాలని అధికారులకు సూచించారు.గ్రామాల్లో మొక్కల పెంపకం మరియు వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.ఇక ప్రతి రోజు పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.భోజనం రుచికరంగా,పరిశుభ్రంగా ఉందో లేదో పరిశీలించి పిల్లలకు పోషకాహారంతో కూడిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.విద్యార్థుల ఆరోగ్యం మరియు విద్యాభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్ రెడ్డి,సర్పంచ్ యాకమ్మ,ఉప సర్పంచ్ విజయేందర్ రెడ్డి,సంబంధిత శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

కొలనుపాక గ్రామ పంచాయతీ కార్యాలయాన్నీఅదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News