Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:27 AM

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి. మంత్రులకు యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ వినతి

16-05-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లు నిర్వహించాలని యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

కొండపై ఉన్న 10 దుకాణాలకు వర్తక సంఘం ద్వారా దేవస్థానానికి ఏటా కేవలం రూ.1.68 కోట్లు మాత్రమే అందుతున్నాయని పేర్కొన్నారు. అదే టెండర్ల ద్వారా నిర్వహిస్తే దేవస్థానానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. ఒక సెల్‌ఫోన్ కౌంటర్‌కే ఏటా రూ.2.22 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశముందని తెలిపారు.

ప్రతి ఏడాది టెండర్లు నిర్వహించడం ద్వారా కొత్త వారికి ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయని, దేవస్థాన ఆదాయం పెరిగి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న 10 దుకాణాలను రద్దు చేసి అదనంగా 30 కొత్త దుకాణాలకు టెండర్లు పిలవాలని స్థానికులు, వ్యాపారులు, నిరుద్యోగులు కోరుతున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో కాటబత్తిని ఆంజనేయులు, ఆరెస్వామి, బండ రామస్వామి, దండబోయిన వీరేష్, బండి వాసు, కర్రే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి. మంత్రులకు యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ వినతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News