Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:21 AM

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి
15-05-2026 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని రద్దు చేసి దుకాణాలకు బహిరంగ టెండర్లు నిర్వహించాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.

ప్రస్తుతం వర్తక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న 10 దుకాణాల ద్వారా సంవత్సరానికి కేవలం రూ.1.68 కోట్లు మాత్రమే దేవస్థానానికి ఆదాయం వస్తోందని కమిటీ సభ్యులు తెలిపారు. అదే టెండర్ల ద్వారా కేటాయిస్తే రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈనెల 31తో దుకాణాల గడువు ముగియనున్న నేపథ్యంలో వెంటనే టెండర్ ప్రక్రియ చేపట్టాలని కోరారు.

కొండకింద అన్నదానం కాంప్లెక్స్ వద్ద ఉన్న 112 షాపింగ్ కాంప్లెక్స్‌లకు కూడా టెండర్లు నిర్వహిస్తే దేవస్థానానికి ఆదాయం పెరగడంతో పాటు స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కొందరే ఏళ్ల తరబడి దుకాణాలను కొనసాగించడం వల్ల దేవస్థాన ఆదాయానికి నష్టం జరుగుతోందని ఆరోపించారు.

దేవస్థాన అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పెంపు కోసం పారదర్శక టెండర్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాటబత్తిని ఆంజనేయులు, బండ రామస్వామి, దండబోయిన వీరేష్, బండి వాసు, కర్రె ప్రవీణ్, బండి అనిల్, కొన్నె సంజీవ, గుండ్లపల్లి లింగం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News