Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:19 AM

కొండపై షాపులకు టెండర్లు నిర్వహించాలి యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్

07-05-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి:

కొండపై వర్తక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న దుకాణాలకు వెంటనే టెండర్లు నిర్వహించాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం దేవస్థానం ఈవోకు కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా కొత్త టెండర్లు నిర్వహించకుండా కొందరు రాజకీయ పలుకుబడితో వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని తక్కువ కిరాయిలతో దుకాణాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీంతో కొత్తవారికి అవకాశాలు లేకుండా పోతున్నాయని తెలిపారు.

ఏళ్ల తరబడి రెన్యువల్ లేకుండానే కొందరు దుకాణాలు కొనసాగిస్తున్నారని, వారి ప్రభావంతో టెండర్ల ప్రక్రియను అడ్డుకుంటున్నారని విమర్శించారు. స్థానిక నిరుద్యోగులు ఉపాధి కోసం తక్కువ జీతాలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

దుకాణాల నిర్వహణ వల్ల దేవస్థానానికి ఆదాయ నష్టం కలగడమే కాకుండా, భక్తులను అధిక ధరలతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పారదర్శకంగా టెండర్లు నిర్వహించాలని కోరారు.

మే 31లోపు షాపులను వేలం వేయకపోతే జూన్ 1 నుంచి స్థానిక నిరుద్యోగులతో కలిసి కొండపైకి వెళ్లి కొబ్బరికాయలు, పూలు, పండ్లు, వస్త్రాలు విక్రయిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సుడుగు జీవన్‌రెడ్డి, కాటబత్తిని ఆంజనేయులు, దేవపూజ అశోక్, గుండు నరసింహ, మిరియాల కృష్ణ, సతీష్ బట్టు, వంగపల్లి అరుణ్, బండి అనిల్, మందోజు నరేష్, కర్రె ప్రవీణ్, గుండు కుమార్, ఆరె కుమార్, కొనే ప్రశాంత్, గోపగాని ప్రసాద్, కర్రె శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొండపై షాపులకు టెండర్లు నిర్వహించాలి యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News