Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:22 AM

కొండపై ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

కొండపై ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

కొండపై ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు
12-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు, పారాయణాలు

యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హనుమాన్‌ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కొండపై పుష్కరిణి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో వేడుకలు జరిపారు.

ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, పురోహితులు అభిషేకం, ప్రత్యేక అలంకారం, హనుమాన్‌ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం, వేదపఠనం నిర్వహించారు. అలాగే లక్ష తమలపాకు అర్చన, మహామంగళహారతి చేపట్టారు.

అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భవానీశంకర్‌, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఉప ప్రధాన అర్చకులు శ్రీధరాచార్యులు, ఆదిత్యాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

కొండపై ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News