Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెంకటాపురం పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్స్‌ల పంపిణీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 01:02 PM

కోదాడ లాకప్ డెత్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్

24-01-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

మేజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు

డీజీపీ, కలెక్టర్, ఎస్పీకి నోటీసులు

కోదాడ, జనవరి:

సూర్యాపేట జిల్లా కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై మేజిస్టీరియల్ విచారణ చేపట్టాలని ఆదేశిస్తూ తెలంగాణ డీజీపీ, సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది.

గత ఏడాది నవంబర్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసిన కర్ల రాజేష్‌ను కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల వేధింపులు తట్టుకోలేక రాజేష్ మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఢిల్లీ యూనివర్సిటీ లా స్టూడెంట్, రంగారెడ్డి జిల్లాకు చెందిన సభావత్ కళ్యాణ్ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, ఎనిమిది వారాల్లో పూర్తి చర్యల నివేదికతో పాటు మేజిస్టీరియల్ విచారణ నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించింది

Sthanikam

కోదాడ లాకప్ డెత్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News