Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

ఖేఢ్ మున్సిపల్ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గడపగడపకు ప్రచారం

Updated : 05 Feb 2026 19:43 IST
As Preferred Source 1 min read
ఖేఢ్ మున్సిపల్ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గడపగడపకు ప్రచారం

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి.ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని రెండవ వార్డు, మూడవ వార్డు మరియు నాలుగవ వార్డులలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థులను చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో మాజీ జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు నగేష్ కుమార్ షేట్కార్ పాల్గొన్నారు.అనంతరం శాసనసభ్యుడు ప్రజలతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో అధికారంలోకి వచ్చిన కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే పట్టణంలోని ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టి అనేక సమస్యలకు పరిష్కారం చూపామని తెలిపారు. పట్టణ ప్రజలు ఎదుర్కొనే విద్యుత్ సమస్యలు మరియు త్రాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని అన్నారు.పట్టణ సుందరీకరణలో భాగంగా ప్రధాన కూడళ్లలో అభివృద్ధి పనులు చేపట్టామని, చౌరస్తాలలో ఆకర్షణీయమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో పాటు పిల్లలకు ఆడుకునేందుకు మంచి వాతావరణం ఉండాలనే లక్ష్యంతో పట్టణంలో అర్బన్ ఫారెస్ట్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆ పార్కు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.కావున అధికార పార్టీకి ఓటు వేసి నారాయణఖేడ్ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరూ చేయి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో రెండవ వార్డు అభ్యర్థి సురేఖ విట్టల్, మూడవ వార్డు అభ్యర్థి శైలజ ఆనంద్, నాలుగవ వార్డు అభ్యర్థి దారం శంకర్ సెట్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

ఖేఢ్ మున్సిపల్ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గడపగడపకు ప్రచారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి