Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:53 PM

ఖేఢ్ లో మహిళల స్వయం ఉపాధికి మహిళా సంఘాల జాతర

ఖేఢ్ లో మహిళల స్వయం ఉపాధికి మహిళా సంఘాల జాతర

ఖేఢ్ లో మహిళల స్వయం ఉపాధికి మహిళా సంఘాల జాతర
January 25, 2026 09:22 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో భాగంగా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు రుణాలు అందించి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ నేపథ్యంలో నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన మరియు విక్రయ కార్యక్రమాన్ని ‘మహిళా సంఘాల జాతర’ పేరుతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి,సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్య,

నారాయణఖేడ్ ఉప కలెక్టర్ ఉమా హారతి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రాలను పరిశీలించారు. ఉత్పత్తుల తయారీ విధానం, నాణ్యత, విక్రయ విధానాలపై మహిళలతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.మహిళలు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వంత వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా బలపడాలని సూచించారు.అనంతరం వారు నారాయణఖేడ్ పట్టణంలోని గ్రంథాలయాన్ని సందర్శించారు. అక్కడ విద్యార్థులకు అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఎదురవుతున్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సమగ్ర గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, పలువురు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News