Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

ఖేడ్‌లో పట్టణ అరణ్య పార్కు అభివృద్ధి పనులను పరిశీలించిన:ఖేఢ్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

Updated : 25 Jan 2026 21:37 IST
As Preferred Source 1 min read
ఖేడ్‌లో పట్టణ అరణ్య పార్కు అభివృద్ధి పనులను పరిశీలించిన:ఖేఢ్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నారాయణఖేడ్ మండలం జుక్కల్ శివారులో ఏర్పాటు చేస్తున్న పట్టణ అరణ్య పార్కు అభివృద్ధి పనులను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, నారాయణఖేడ్ ఉప కలెక్టర్ ఉమా హారతి పాల్గొని, పట్టణ అరణ్య పార్కులో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు.పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం అందించే విధంగా, పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా పార్కు అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. అలాగే మొక్కల నాటకం, నడక మార్గాలు, విశ్రాంతి ఏర్పాట్లు తదితర సౌకర్యాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా ఏర్పాటు చేయాలని తెలిపారు.పట్టణ అరణ్య పార్కు పూర్తయిన తరువాత ప్రజలకు విహారానికి అనువుగా ఉండటంతో పాటు, ప్రాంతంలోని పర్యావరణ సమతుల్యతకు కూడా దోహదపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ఖేడ్‌లో పట్టణ అరణ్య పార్కు అభివృద్ధి పనులను పరిశీలించిన:ఖేఢ్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నారాయణఖేడ్ మండలం జుక్కల్ శివారులో ఏర్పాటు చేస్తున్న పట్టణ అరణ్య పార్కు అభివృద్ధి పనులను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, నారాయణఖేడ్ ఉప కలెక్టర్ ఉమా హారతి పాల్గొని, పట్టణ అరణ్య పార్కులో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు.పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం అందించే విధంగా, పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా పార్కు అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. అలాగే మొక్కల నాటకం, నడక మార్గాలు, విశ్రాంతి ఏర్పాట్లు తదితర సౌకర్యాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా ఏర్పాటు చేయాలని తెలిపారు.పట్టణ అరణ్య పార్కు పూర్తయిన తరువాత ప్రజలకు విహారానికి అనువుగా ఉండటంతో పాటు, ప్రాంతంలోని పర్యావరణ సమతుల్యతకు కూడా దోహదపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news