Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ పౌర్ణమి వేళ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు శుభాకాంక్షలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:39 PM

ఖేడ్‌లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ – కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

05-02-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ నివాసంలో గురువారం ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యుడు నాగేష్ షేట్కార్ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ పట్టణం 7వ వార్డు శాస్త్రి నగర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మొండి సాయిలుతో పాటు ఆయన అనుచరులు సుమారు 25 మంది కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరినట్లు నూతన సభ్యులు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కలిసి పనిచేస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్, నాగ్రెసం పటేల్, యాదగిరి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జరుగుతున్న ఈ భారీ చేరికలు నారాయణఖేడ్ రాజకీయాల్లో కీలక మలుపుగా మారాయని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

ఖేడ్‌లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ – కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News